అవసరమైతే భారతదేశ రాజకీయాల్లోకి రావడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారీ మద్దతు లభిస్తున్నది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంకా ఇతర రాష్ర్టాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే తాజాగా ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణ మూర్తి సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ థర్డ్ ఫ్రంట్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజకీయాలు మారాలంటే సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులకే సాధ్యం అని ఆయన ఉద్ఘాటించారు.కాగా గతంలో తెలుగు మహాసభల్లో కూడా కేసీఆర్ గారు మీరు ప్రధాని కావాలి అని అన్న విషయం తెలిసిందే.
see also :తెలంగాణ బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై
అలాగే ఇవాళ హుజూర్ నగర్ పర్యనలో ఉన్న ప్రముఖ సినీ నటుడు సుమన్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు తెలిపారు.తెలుగు రాష్ర్టాల ప్రజల బాధలు కేంద్రంలో ఉన్నవారికి అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి ప్రధాని కావాలన్నారు.
see also :సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?