దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రత్యామ్నాయం ఏర్పడాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయంపై పలు ప్రాంతాయ పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అంతేకాదు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం తాము సైతం కలిసి వస్తామని చెప్పారు. కాగా తాజాగా ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ ట్వీట్ చేశారు.డిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్న తెలుగు నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ మాత్రమే అని ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
see also :సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?
see also : దేశంలో మార్పు తెలంగాణ నుండే..సీఎం కేసీఆర్
ఢిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్న తెలుగు నాయకుడు ఎవరైనా ఉంటే అది…కేసీఆర్ మాత్రమే!
— Kathi Mahesh (@kathimahesh) March 4, 2018