ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరిన విషయం అందరికీ తెలిసిందే. వైసీఈప అధినేత వైఎస్ జగన్.. జెండా ఊపి వారి పోరాటానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేసిన ఆ తరువాత పార్లమెంటులో తమ పోరాటం ఉంటుందని జగన్ తెలిపారు.
మార్చి 21న ఎన్టీఏ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు పార్టీలో ఉన్న ఎంపీలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేలా ఆయన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ చూడాలని అన్నారు.
చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఆయన మంత్రులు పదవులు వదులుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని జగన్ తెలిపారు. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేవరకు అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకామని కుండ బద్దలు కొట్టారు.