తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే..భారతదేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని నిన్న ప్రగతి భవన్లో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేసీఆర్ ప్రకటన పట్ల దేశనలుముల నుండి మద్దతు లబిస్తున్న సంగతి కూడా తెలిసిందే..కాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపొందే ఫ్రంట్‌ను తాను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరముందన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని పోయే సామర్థ్యం సీఎం కేసీఆర్ కు ఉందని చెప్పారు.భారతీయ జనతా పార్టీని చూసి జనం భయపడుతున్నారని అసద్ తెలిపారు.