తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పలువురు నుండి మద్దతు లభిస్తుంది.నిన్న శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటె బీజేపీ ,బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తోరోకులు చేయడం తప్ప దేశ ప్రజలకు ,రైతాంగానికి ఎటువంటి న్యాయం జరగలేదని ..అందుకే సరికొత్త నాయకత్వం కావాలని ఆయన అన్నారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు ఏపీ వైసీపీ నేత ,మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ .
ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి.ఇదే క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తామని ప్రకటించడం అభినందనీయం.ఆయనతో పాటు మేము దేశ రాజకీయాలను మార్చడానికి పని చేస్తామని ప్రకటించారు ..