చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్..!! అవును, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రత్యేక హోదా అంశంపై పోరాటానికి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన చివర శ్వాస వరకు ప్రత్యేక హోదాపై పోరాడతానని చెప్పాడు… మరీ నీ శరీరంలో చీము నెత్తురు ఉంటే మీ ఎంపీల చేత రాజీనామా చేయించు అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్.
see also : చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!!
see also : ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!
see also : దమ్మున్న నాయకుడు లేకుంటే.. ఇలానే జరుగిద్ది : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
ప్రత్యేక హోదా పోరాటంలో భాగమై నీ చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకో, వైసీసీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల చేత, టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయించు అంటూ సవాల్ విసిరారు. ఇప్పటికైనా రెండుకళ్ల సిద్ధాంతాన్ని వీడు.. లేకుంటే చరిత్ర హీనుడవై మిగులుతావు అంటూ ఎద్దేవ చేశారు అనీల్ కుమార్ యాదవ్.