Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!

వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!

ఏపీలో ఎన్నికల సమరానికి మరో ఏడాది ఉండగానే అప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్లు ఉంది.అందుకే అధికార పార్టీ అయిన టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి పక్క ప్రణాళికలు రచిస్తుంది.అందులో భాగంగానే గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా అని ప్రత్యేక ఫ్యాకేజీకు ఒప్పుకుంది టీడీపీ .తాజాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రత్యేక హోదా కంటే ఫ్యాకేజీకే ఎక్కువ నిధులు వస్తాయని కేంద్రం నమ్మించి మోసం చేసిందని నెపం బీజేపీ పార్టీ వేస్తుంది టీడీపీ.అయితే అదే వేరే విషయం అయితే తాజాగా అప్పుడే గుంటూరు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఎవరిది అంటూ చర్చలు ప్రారంభమయ్యాయి.

See Also:ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!

ఈ క్రమంలో ప్రస్తుతం అధికార పార్టీ టీడీపీ నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ బరిలోకి దిగుతుండగా ..మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున ప్రముఖ విద్యాసంస్థలు విజ్ఞాన్ సంస్థ యజమాని లావు రత్తయ్య మనవడు లావు శ్రీకృష్ణ దేవరాయలు బరిలోకి దిగనున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.అయితే వీరిద్దరిలో గెలుపు ఎవరిది ..ఎందుకు గెలుస్తారో ఒక లుక్ వేద్దామా ..?.గత సార్వత్రిక ఎన్నికల మాదిరిగా అంత ఈజీగా కాకుండా ఈసారి మాత్రం చాలా రసవత్తంగా జరుగుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

See Also:8వ వింత ..జగన్ పై చంద్రబాబు పొగడ్తల వర్షం..!

ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో గల్లా జయదేవ్ గెలుపు కష్టమని ప్రచారం జరిగిన కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత ,బాబుకు తొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ,మరో తొమ్మిది ఏళ్ళు ప్రతిపక్ష నేతగా మంచి అనుభవం ఉండటం ..మోదీ హావా ,పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తో పాటుగా ప్రముఖ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం అండదండలు ఇలా పలు కారణాలతో జయదేవ్ లక్ష మెజారిటీతో గెలుపొందారు అని అప్పట్లోనే పలు విశ్లేషణలు వచ్చాయి.అంతే కాకుండా నిజానికి ప్రముఖ పెద్ద పారిశ్రామిక వేత్త కావడంతో గుంటూరులో పరిశ్రమలను పెడతాడు అని ..ప్రజలకు ,నిరుద్యోగ యువతకు అండగా ఉంటాడని అందరు నమ్మారు.

See Also:జగన్ పై ప్రముఖ సినీ నటుడు ప్రశంసల జల్లు..!

అయితే తీరా లక్ష మెజారిటీతో గెలిచిన తర్వాత ప్రజాశ్రేయస్సు కంటే తన వ్యాపారం అభివృద్ధి కోసమే ఎక్కువగా సమయం కేటాయించాడని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.అంతే కాకుండా గత నాలుగు ఏండ్లుగా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేర్చకపోవడమే కాకుండా ఏకంగా ప్రత్యేక హోదా లాంటి హమీను కూడా తుంగలో తొక్కడంతో ప్రజలతో పాటుగా నిరుద్యోగ యువత ,విద్యావంతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది.అన్నిటికి మించి గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ చేసిన రెండున్నర లక్షల కోట్ల అవినీతి కూడా గల్లా జయదేవ్ గెలుపు పై నీలి నీడలు కమ్ముకున్నాయి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు శ్రీకృష్ణ దేవరాయులు మొదటి నుండి మంచి పేరు ప్రఖ్యాతలు కల్గిన కుటుంబం కావడం…జిల్లాలోనే ఎక్కువగా విద్యాసంస్థలు ఉండటమే కాకుండా అన్ని వర్గాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను తక్కువ ఫీజులతో అందించడమే కాకుండా ఫీజులు కట్టలేనివారికి కూడా ఉహించని విధంగా రాయితీలిచ్చి మరి వారి అభివృద్ధికి పాటుపడటంతో ఆయనపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఉంది.

See Also:చంద్రబాబు 40ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ..చరిత్రలో చెరగని 40తప్పులు ..!

అంతే కాకుండా మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా గత నాలుగు ఏండ్లుగా ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ,విభజన చట్టంలో హామీల నేరవేర్చడంకోసం బాబు సర్కారుపై గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేయడమే కాకుండా బాబు సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలపై పోరాడుతూ ప్రజల్లో కల్గించిన చైతన్యం కూడా శ్రీకృష్ణ గెలుపుకు కారణం కానున్నాయి అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే ఆర్థికంగా గల్లా బలంగా ఉండటంతో కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చిన కానీ శ్రీకృష్ణ లోకల్ కావడం ..పొలిటికల్ కు కొత్త కావడంతో ఎటువంటి ఆరోపణలు లేకపోవడం ..ప్రజల్లో ఉన్న సానుకూలత అన్నిటికంటే టీడీపీ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత కూడా శ్రీకృష్ణ గెలుపుకు అడ్డులేదని మెజారిటీ వర్గాల అభిప్రాయం.చూడాలి మరి గుంటూరు వాళ్ళు ఎవరికీ పట్టం కడతారో ..?.

See Also:మీరు సెంటర్‌ డిసైడ్‌ చేయండి..మేం చర్చకు సిద్ధం..వైఎస్‌ అవినాష్‌రెడ్డి

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat