తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది.అందుకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా మైనారిటీలకు పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు పొందిన 9 మంది, సిద్ధిపేటకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు అబ్దుల్ ఖాదర్ లను సిద్ధిపేట మిల్లతే-ఇస్లామియా వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమాన్ని సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మదీనా ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించింది.ఈ క్రమంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు ఆనందంగా ఉన్నారని ..అందరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అని అన్నారు.