భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని అరెస్ట్ చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో భక్తల్ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియాలో బాల్స్ బాయ్స్ అనే వాట్సాప్ గ్రూపుకు అడ్మిన్ గా ఉన్న కృష్ణ సన్న తమ్మనాయక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
అదే సమయంలో ఆయనతో పాటు ఆ గ్రూపులో సభ్యుడిగా ఉన్న గణేష్ ను కూడా అరెస్టు చేశారు.అయితే గణేష్ మాత్రం బెయిల్ పై విడుదల అయ్యాడు.కానీ తమ్మనాయక్ ను మాత్రం జుడిషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు.గతంలో ఒక వ్యక్తిని ఆధారాలు లేకుండా సదరు వ్యక్తి యొక్క పరువుకు భంగం కల్గించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవచ్చు అని వారణాసి జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి యోగేశ్వర్ తీర్పునిచ్చారు.
అయితే ఈ నిబంధనల ప్రకారం గ్రూపులో సభ్యుడు పెట్టె నిరాధారమైన పోస్టులకు ఆ గ్రూపు అడ్మిన్ భాద్యత వహించాలని సదరు న్యాయస్థానం అప్పుట్లోనే తేల్చి చెప్పింది.అయితే దేశంలోనే తొలిసారిగా ఇలా అడ్మిన్ ను అరెస్ట్ చేయడం ఆశ్చర్యకరం ..