ఇటీవల రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సదస్సులో ప్రధాని మోదీ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలో మోడీగారు అనబోయి.. స్పీడ్ లో తప్పులు దొర్లాయని ఎంపీ కవిత అన్నారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కించపరిచే ఉద్దేశం సీ ఎం కేసీఆర్ కు లేదని ఆమె వివరణ ఇచ్చారు.
see also : ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!
రైతు కష్టాలపై ఆవేదనతో మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగిందని చెప్పారు .ఈ విషయాన్నీ కావాలనే రాష్ట్ర బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. రైతు బడ్జెట్ అంటూ చెప్పిన కేంద్రం.. వారికి కేటాయించింది ఏమీ లేదన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని.. అందుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. గతంలో మోడీ కూడా 600 కోట్ల మంది భారతీయులు అని అనలేదా అని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించారు.
see also :మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!