ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితులు ఢిల్లీ వేదికగా మొదలవుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమర్శల పర్వం కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై రిపోర్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
see also :మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!
గవరనర్ నరసింహన్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించే అవకాశముందని తెలిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని ఆయన కలుస్తారని సమాచారం. ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీలో టీడీపీ చేస్తున్న రాజకీయ ఎదురుదాడి గురించి కూడా చర్చకు రానుందని సమాచారం. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు చేసిన కామెంట్లు, రాజకీయంగా బీజేపీని ఇరకాటంలో పెడుతున్న తీరుపై కూడా ప్రధాని మోడీ అడిగి తెలుసుకోనున్నారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
see also :ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!
దీంతోపాటుగా హైకోర్టు, హెచ్చార్సీ, లోకాయుక్త, ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ వంటి ఉమ్మడి సంస్థల విభజన అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై సాగుతున్న రగడ చర్చకు రావచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్ సంస్థల విభజనపై పురోగతిని గవర్నర్ కేంద్రానికి వివరించనున్నారు. దీనిపై ఈ నెల 5న ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రప్రభుత్వాల చీఫ్ సెక్రటరీల సమావేశం జరుగనుంది. గవర్నర్ సోమవారం ఉదయం విజయవాడకు బయలుదేరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తారని సమాచారం.