అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విపక్షాలకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండటం వల్లే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇన్ని రోజులు ముఖ్యమంత్రి జిల్లాలు తిరగడం లేదన్నారు ఇపుడు సీఎం జిల్లాల పర్యటనలు చేస్తోంటే ఏం చేయాలో విపక్షాలకు అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలు ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాయని తాము వెళ్తే తప్పా? అని సూటిగా ప్రశ్నించారు.
see also :మంచి మనస్సున్న మాహారాజు”ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్”…!
see also :భవనాలు తప్పా ఒక్క ఉద్యోగం రాదు-జేసీ దివాకర్ రెడ్డి..!
సూట్ వేసుకుంటే అమెరికా భాష అంటారు, ప్రజల భాషలో మాట్లాడితే తప్పంటున్నారని ఇదేం తీరు అని మంత్రి కేటీఆర్ విపక్షాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల గురించి నేను పూర్తి వాస్తవాలే మాట్లాడాను, ఉన్నదంటే అంత ఉలుకెందుకు ? అని మంత్రి కేటీఆర్ సూటిగా నిలదీశారు. ఇంకో మారు బచ్చా అంటే ఏం సమాధానం చెబుతానో చూడండి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.