సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది.
నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా కోలీవుడ్ లో హిట్ కావడం వలన మాపై హిట్ పెయిర్ అని పేరొచ్చింది.సినిమాల్లో కూడా మేము అలాగే నటించాం అని ఆయన తమపై వస్తున్నా కథనాల మీద స్పందించారు.