ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ,సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరొకసారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన స్టైల్.ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రజలు పోరాడుతున్న ప్రత్యేక హోదా ,ప్రత్యేక ఫ్యాకేజీ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు శుక్రవారం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాల గురించి..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి హాట్ హాట్ గా చర్చించారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా వలన ప్రజలకు ఏమి ఉపయోగం లేదు.
ఒకవేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఇచ్చిన ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదు.ఇక విశాఖకు రైల్వే జోన్ రావడం వలన ఒక్కపైసా ఉపయోగం లేకపోవడమే కాకుండా ఒక్కరికి కూడా ఉద్యోగం రాదు.కేవలం వేల కోట్ల రూపాయలను పెట్టి పెద్ద పెద్ద అంతస్తులను కట్టించడానికి తప్ప దేనికి అవి పనికి రావు అని ఆయన మరో సారి తనదైన స్టైల్ లో వ్యాఖ్యానించారు.