ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తేల్చి చెప్పాడు .ఈ రోజు శుక్రవారం రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలతో పాటుగా కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు.
see also : 2019 ఎన్నికలు : సీఎం ఎవరో తేల్చేసిన తాజా సర్వే..!!
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ,విభజన చట్టంలోని హామీలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ,ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
see also :వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి హామీలను నేరవేర్చకపోతే హామీల అమలు కోసం కోర్టుకు పోతామని తేల్చి చెప్పారు.అయితే ఒకవేళ ఎంపీ గల్లా జయదేవ్ అన్నట్లు కోర్టుకు పొతే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా బాబుపై నమోదైన కేసులను బీజేపీ తిరిగి తోడటం ఖాయమంటున్నారు రాజకీయ వర్గాలు .ఏది ఏమైనా గల్లా జయదేవ్ తేల్చి చెప్పిన విధంగా కోర్టుకు పోతే బాబుకు కష్టమే అన్నమాట ..
see also :దేశంలోనే తొలిసారి ..పోస్టు పెట్టాడు ..అరెస్టు అయ్యాడు..!