తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో సుమారు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయినవారిలో ఆ పార్టీ కీలక నేత హరిభూషణ్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సిఉంది.
see also :”ఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియవు” చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!!
ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..చర్ల మండలం తొండపాల్ సమీపంలో మావోయిస్టులు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో గ్రేహౌండ్స్-ఈవోఎస్ బలగాలు అటుగా కదిలాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు.. ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు చేశాయి. ఈ క్రమంలో 12 మంది మావోయిస్టులు చనిపోగా, ఒకరిద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలి నుంచి ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాదీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.