తెలంగాణ రాష్ట్రం డిజిటల్ లావాదేవీల్లో దుసుకేల్లుతుంది.మొత్తం డిజిటల్ లావాదేవీలను సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ప్రతి వెయ్యి మంది జరుపుతున్న లావాదేవీల్లో మాత్రం తొలి స్థానం ఆక్రమించింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్రతి వెయ్యి మంది నిర్వహిస్తున్న డిజిటల్ లావాదేవీల సంఖ్య 64,213 గా నమోదైంది. తర్వాతి స్థానంలో 55,866 లావాదేవీలతో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
see also :శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు 225.99 కోట్ల డిజిటల్ లావాదేవీలను నిర్వహించింది. ఈ 44 నెలల కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1545.38 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో అతి తక్కువ జనాభా ఉన్న లక్షద్వీప్‌లో ప్రతి వెయ్యి మంది నాలుగేళ్లుగా జరిపిన డిజిటల్ లావాదేవీల సంఖ్య 97, 963గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 192 సేవలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. సగటున ఒక్కో సేవకు జరుపుతున్న లావాదేవీలను చూసినా 1.86 శాతంతో తెలంగాణ రికార్డు స్థానంలో ఉంది.