తమ అందచందాలను కాపాడుకోవడానికి హీరోయిన్లు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందం ఉంటేనే వారికి అవకాశాలు, ఛాన్సులు, పేరు ప్రతిష్టలు. అయితే, ప్రస్తుతం దక్షిణాదిన తమన్నా హవా నడుస్తోంది. నూటికి నూరుపాళ్లు అందం తమన్నా సొంతం. మిల్కీబ్యూటీగా పేరొందిన ఈ భామకు బాహుబలి పుణ్యమా అని మళ్లీ సినిమా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుస సినిమా అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.
see also : ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!
see also : అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!!
అయితే, తమిళ హీరో విక్రమ్, తమన్నా కాంబోలో వచ్చిన స్కెచ్ మూవీ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మిల్కీబ్యూటీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్కెచ్‌మూవీకి సంబంధించిన ప్రతీ పోస్టర్స్‌లో చీరకట్టులో ఉన్న తమన్నా అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది. చీర కట్టడానికి వయసుతో పనేమీ లేదని, తాను తన పదహారవ ఏటనే చీర కట్టడం నేర్చుకున్నా.. అప్పట్నుంచి ప్రతీ కార్యక్రమంలోనూ చీరకట్టుతోనే కనిపిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. చీర కట్టడం ఆస్వాదిస్తే.. ఆ కోరిక ఉంటే చాటు.. అంతేకాని, చీర కట్టడానికి వయసుతో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది.