టీం ఇండియా జట్టుకు దూకుడు నేర్పి విదేశాల్లో గెలుపును రుచి చూపించిన కెప్టెన్ ..కళ్ళు మిటకరిస్తూ ఫ్రంట్ కి వచ్చి మరి కొడితే సిక్స్ లేకపోతే స్టంప్ అవుట్ అయ్యే ఆటగాడు..ఒక్కసారిగా కుదురుకున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ
.అంతటి చరిత్ర ఉన్న ఈ దాదా నేతృత్వంలోనే చాలా రోజుల తర్వాత 2003లో జరిగిన వరల్డ్ కప్ లో ఫైనల్ కు వెళ్ళింది టీంఇండియా .
తాజాగా క్రికెట్ నుండి రిటైర్ అయిన దాదా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ..క్రికెట్ వ్యాఖ్యాతగా తన సేవలను అందిస్తున్నాడు .ఈ క్రమంలో గంగూలీ తన ఆత్మకథను ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే పుస్తక రూపంలో విడుదల చేశాడు .దానిలో గంగూలీ గతంలో 2003 ప్రపంచ కప్ కంటే ముందుంచే యువ ఆటగాళ్ళ కోసం అన్వేషణప్రారంభించాం.అయితే తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి జట్టును గెలుపుకు చేర్చే ఆటగాళ్ళ కోసం గాలిస్తున్నాను.ఆ క్రమంలో ధోని నా దృష్టిలో పడ్డాడు.అంతే అడిగాను జట్టుకు ఆడామని.
నేను ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో జాబు చేస్తున్నాను ఎలా రాగాలను అని అన్నాడు .దాంతో నేను షాక్ కు గురయ్యాను .అయితే నేను అప్పుడు ఇచ్చిన సలహాను ధోని 2004 చాలా సీరియస్ గా తీసుకొని జట్టులోకి వచ్చాడు.అప్పటి నుండి ధోని ప్రత్యేకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు .నేను నాడు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రపంచ కప్ ,ట్వంటీ ట్వంటీ ప్రపంచ కప్ ,టెస్ట్ లో నెంబర్ వన్ తీసుకొచ్చి జగజ్జేతగా నిలిచాడు దాదా తన శిష్యుడిపై ప్రశంసలు కురిపించాడు ..