సిరియా.. ప్రే ఫర్ సిరియా.. సోషల్ మీడియాలో ప్రధానంగా కొద్దిరోజులుగా బాంబల దాడులు, చిన్నపిల్లల శవాలు.. ప్రే ఫర్ సిరియా అంటూ అందరూ బాధ పడిపోతున్నారు. మనసున్న ప్రతిఒక్కరు అలా తలచి తల్లడిల్లిపోవడం సహజమే.. అయితే సిరియా కోసం ప్రార్ధించే ముందు.. అసలు సిరియాలో గతంలో ఏం జరిగింది.. ప్రస్తుతం ఏం జరుగుతోంది.. అనేది తెలిపే చిన్న విశ్లేషణ..
సిరియాలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం సివిల్ వార్ కొన్ని సంవత్సరాల ముందే మొదలైంది. అసుల ఈ అంతర్యుద్ధం ఎవరెవరి మధ్య జరగుతోంది.. ఒకటి అక్క డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది ఉధ్యమకారులు, రెండవది సిరియాని ఆక్రమించాలని ఐఎస్ఐఎస్, ఆల్‌ఖైదా తీవ్రవాద సంస్థలు, మూడువది సిరియా ప్రభుత్వం రష్యా దళాలు, సిరియాలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలని అమెరికా సాయంతో ఉధ్యమకారులు రెచ్చిపోతున్నారు. తద్వారా సిరయా మీద తాము పట్టు సాధించాలని అమెరికా కుటిల పన్నాగమిది.
ఇక మరోవైపు ఐఎస్ఐఎస్, జీహాదీ మత ఉగ్రవాద సంస్థలు సిరియాని ఆక్రమించాలని చూస్తున్నారు. వాళ్లకి సాయంగా ఆల్‌ఖైదా కూడా జతకట్టింది. అయితే సిరయా ప్రభుత్వం రష్యా సాయంతో ఐఎస్ఐస్ తీవ్రవాదులను అంతం చేస్తోంది. ఉగ్రవాదాన్ని సిరియాలో లేకుండా కూకటి వేళ్లతో పెకలించి దేశంలో తిరిగి శాంతిని నెలకొల్పేలా ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రపంచాన్ని ఆక్రమించాలి. ఖలీఫా సామ్రాజ్యం స్థాపించాలని ఐఎస్ఐఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అయితే సిరియాలో కేవలం 3శాతం భూభాగంతో మాత్రమే ఉగ్రవాదుల ఆధీనంలో ఉంది. దాన్ని సిరియా ప్రభుత్వం రష్యా అండతో తిరిగి స్వాధీనం చేసుకోవాలని దృఢ నిశ్చయంతో పావులు కదుపుతోంది. అందుకే బాంబులు, దాడులు, చిన్నపిల్లలు అనాథలు అవడం.. అంతా బాధా కరమే.
అయితే ఏదేశం కూడా తన భూభాగాన్ని ఆక్రమించి ఇష్టానుసారం రాక్షస పాలన చేస్తుంటే చూస్తూ ఊరుకోద కదా… సిరియా ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే చేస్తోంది. ఇకడ మరొక విషయం ఏంటంటే.. సిరియాను రష్యా అండతో పరిపాలిస్తున్న వ్యక్తి కూడా ఒక షియా ముస్లిమే. అతడి ఆజ్ఞతో బాంబులు వేయగానే నాశమైపోతున్న ఉగ్రవాదులు సున్నీలు.. అందుకు కూడా హింస బీభత్సంగా జరుగుతోంది. సిరియా మారణకాండ చాలా బాధాకరం. కానీ అది ఆ దేశ అంతర్గత విషయం. సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టుల వలన పసిపిల్లలకు పాపం వచ్చేదేంలేదు. మనుషులుగా ఈ ప్రపంచమానవాలి కోరుకోవాల్సింది ఏంటంటే.. పుతిన్ అండతో సిరియా త్వరగా ఉగ్రవాదులు లేని దేశం కావాలని.. సిరియా అధికారిక సైన్యం ఉగ్రమూకలను మట్టుబెట్టాలని.. అంతవరకు సిరియా పాపలు, బాబులు అంటూ బోలెడు ఫొటోలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి.
ఇక అక్కడి ప్రజలు ఇలాంటి దాడులు జరగకున్నా కూడా చస్తూ బ్రతకాల్సిందే.. లేదంటే చావాల్సిందే. ఎందుకంటే రష్యా, సిరియా సైన్యాలు ఉగ్రవాదులు కబంధ హస్తాలనుండి తమ చివరి భూబాగాన్ని లాక్కోకపోతే,.. అక్కడ ఉన్న చిన్నా పెద్దా ముఖ్యంగా ఆడవాళ్లు ఐఎస్ఐస్ మార్కు నరకం చవి చూస్తూనే ఉంటారు. ఇక సమకాలీన చరిత్రలో సిరియా సంక్షోభం మిగిల్చినంత విషాదం మరేదీ లేదని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. రెండు కోట్ల మంది సిరియన్లకు ఆహారం, మంచినీళ్ల లాంటి నిత్యావసరాలు తక్షణసాయం అవసరమని తెలిపింది. ఈపరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ సిరియా ప్రజలకు అండగా నిలవాలి. అగ్రరాజ్యాలు తమ ఆధిపత్య జ్వాలల్లో సిరియా ప్రజలను బలిచేయడాన్ని ప్రతిఒక్కరు నిరసించాలి. ఇక తమ చేతుల్లో సిరియాలో ఉన్న పసివాళ్ళు ఏమైనా అరబ్ డాలర్ల బ్యాచ్ సోషల్ మీడియాలో హడావుడి చేయరు. రష్యా సిరియా అధికారిక సైన్యం వల్ల హింస జరిగితేనే మొసళ్లు ఏడవడం మొదలు పెడతాయి. ఆ జిత్తుల మారి నక్కల బాధ పసిపాపల గురించి కాదు తమ ఉగ్రవాదుల చివరి స్థావరాలు కూడా ధ్వంసం అయిపోతున్నాయని.. ధర్మాన్ని రక్షించడంకోసం కొన్నిసార్లు క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోక తప్పదుగా..!