ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో మహిళలకు అతి ముఖ్యంగా దళితులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు.అయితే తాజాగా దళిత సామాజిక వర్గానికి చెందిన అది కూడా మహిళా అందులో మున్సిపల్ చైర్ పర్సన్ ను ఘోరంగా అవమానించారు సంబంధిత శాఖ మంత్రి.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ,నగర టీడీపీ ఇంచార్జ్ శ్రీధర్ కృష్ణారెడ్డి,విజయా డెయిరీ చైర్మన్ రంగారెడ్డి ,స్థానిక కార్పొరేటర్ రాజా నాయుడు అందరు పాల్గొన్నారు.వీరితో పాటుగా నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ శోభారాణి కూడా హాజరయ్యారు.
అయితే అందర్నీ కుర్చిలో కూర్చోబెట్టిన మంత్రి నారాయణ ఒక మున్సిపల్ చైర్ పర్సన్ అందులో మహిళా అయిన శోభారాణిని తమ వెనక నిలబెట్టి మరి మీడియా సమావేశం నిర్వహించడం దళితుల పట్ల ,మహిళల పట్ల ఎంతటి గౌరవం ఉందో అర్ధమవుతుంది అని విమర్శకులు విమర్శిస్తున్నారు.ఇంకో విషయం ఏమిటి అంటే మీడియా సమావేశం మొదలైన దగ్గర నుండి అయ్యేవరకు ఆమె అలా నిలబడి ఉండటం గమనార్హం..