ప్రముఖ వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ హోలీ పండుగ నాడు సంచలనం నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రస్తుతం యావత్తు దేశంలో ఉన్న తన ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాకిచ్చింది.ఇప్పటికే జియోతో ఎంట్రి ఇచ్చి టెలికాం సంస్థలను కోలుకోలేని దెబ్బ కొట్టిన రిలయన్స్ తాజాగా కేబుల్ రంగంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థులను బిగ్ షాక్ కు గురిచేసింది.రిలయన్స్ బిగ్ టీవీ సూపర్ ఆఫర్ తో ముందుకొచ్చింది.
అందులో భాగంగా దాదాపు ఐదు వందల వరకు ఛానల్స్ ను ఏడాది పాటుగా ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో తమ వంతు పాత్రను పోషించడానికి ఈ ఆఫర్ తో ముందుకొచ్చామని ఆ సంస్థ ప్రకటించింది.అందుకు హెచ్ డీ హెచ్ఈవీసీ సెట్ టాప్ బాక్స్ తో రికార్డింగ్ ,యూఎస్బీ పోర్టు,యూట్యూబ్ యాక్సెస్ తో పాటు రికార్డింగ్ చేసుకుంటునే మరో ఛానల్ ను చూసే సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపింది.
ముందస్తు బుకింగ్ కోసం తొలుత నాలుగు వందల తొంబై తొమ్మిది రూపాయలను కట్టాల్సి ఉంటుంది.యూనిట్ వచ్చిన తర్వాత మిగత పదిహేను వందలను చెల్లించాలి .అయితే ఏడాది ఉచిత ఆఫర్ ముగిసిన తర్వాత ఖాతాదారులు నెలకు మూడు వందలతో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా విజయవంతంగా రెండేళ్ళ పాటు రీచార్జీ చేసుకున్న తర్వాత తొలుత చెల్లించిన రూ రెండు వేలను వెనక్కి ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది.