కాంప్రహెన్సివ్ కాన్సర్ కేర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం కింద టాటా ట్రస్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది .హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ నోవాటేల్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ ఛైర్మెన్ రతన్ టాటా,రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టాటా గ్రూప్ తో తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుభవం ఉందన్నారు.రాష్ట్రంలో వివిధ రంగాల్లో టాటా గ్రూప్ సేవలు అందిస్తుందన్నారు.తెలంగాణ ప్రభుత్వానికి టాటా గ్రూప్ ఇస్తున్న మద్దతు మరవలేనిదన్నారు.
see also : టీఆర్ఎస్ పార్టీ మళ్ళి అధికారంలోకి రావడం ఖాయం..మంత్రి తుమ్మల
కేన్సర్ కేర్ కు సంబంధించి దేశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని చెప్పారు.హైదరాబాద్ నగరంలో ఇంక్యూబెటర్ ఏర్పాటులో టాటా సంస్థ పాత్ర ఉందన్నారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చి నట్లు తెలిపారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెరిగిందన్న కేటీఆర్.. గర్భిణీలు డెలీవరికి ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తున్నట్లు చెప్పారు.
see also :హైదరాబాద్ సిగలో మరో ప్రత్యేకత…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం