కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి .చిదంబరం తనయుడు కార్తి చిదంబరంను ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎక్స్ సంస్థకు మారిషన్ నుండి ఇన్వెస్ట్మెంట్ కు పర్మిషన్ వచ్చే విధంగా చూశాడని..దాదాపు మూడు వందల ఐదు కోట్ల మేర విదేశీ పెట్టుబడులను ఆ సంస్థలోకి తీసుకొచ్చాడు.
అందుకు పది లక్షల వరకు లంచం తీసుకున్నాడు అనే అభియోగం మీద కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే.ఈ విషయంలో కార్తి చిదంబరంను అరెస్ట్ కూడా చేశారు . కేసు విచారణలో సంస్థ యజమానులైన ఇంద్రాణి ముఖర్జియా ,పీటర్ ముఖర్జియా సంచలనాత్మక విషయాలను చెప్పారు.
ఎఫ్డీఏ అనుమతి కోసం కార్తి చిదంబరంకు ఏడు లక్షల డాలర్లు లంచం ఇచ్చాం అని ఇంద్రాణి తెలిపారు.అప్పట్లో యూపీఏ హయంలో కేంద్ర మంత్రిగా ఉన్న తన తండ్రి చిదంబరం ను అడ్డుపెట్టుకొని ఈ అక్రమలావాదేవిలకు కార్తి చిదంబరం పాల్గొన్నారు అని వారు తెలిపారు ..