ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ది ఓ నీచ చరిత్ర అని, జగన్ చరిత్ర అంతా రౌడీయిజంతో కూడుకుందని ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి 17నెలలు జైల్లో ఉండి, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి, ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లేటటువంటినేర పూరిత చర్యల వల్ల వైఎస్ జగన్ పేరు ఏపీ, దేశంలోని కొంతమందికి తెలిసిందన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించడానికి అర్హుడు కాదని అన్నారు.
see also : ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!
see also : ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!
వైఎస్ జగన్ పుట్టేకే.. జగన్‌ను రౌడీగా మార్చిందన్నారు. జగన్‌కు చిన్నప్పట్నుంచి నేర పవృత్తి అలవాటేనన్నారు. వైఎస్ జగన్ వంటి నేరపూరిత వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందన్నారు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల చరిత్రలో చిన్న కేసునైనా నీవు చూపించగలా..? అంటూ జగన్‌ను ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు.