అందరికీ అన్నం పెట్టే రైతన్నకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడం సమాజం బాధ్యత అని, ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా నెరవేరుస్తున్నది అమ్మగా అభిమానం పొందిన సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవి ప్రశంసించారు. సముద్రం పాలవుతున్న నీటిని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా పొంట పొలాలకు తరలించడం మంచి ప్రయత్నమని అభినందించారు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
see also :ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!
భారతదేశ యాత్రలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న అమ్మ బుధవారం సికింద్రాబాద్ లోని మాతా అమృతానందమయి మఠం (అమ్మ ఆశ్రమం)లో భక్తులకు దర్శనమిచ్చి, ఆశీర్వచనం అందచేశారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మఠానికి వెళ్లి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు త్వరగా పూర్తయి, రైతులకు సాగునీరు అందేలా ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టుల గురించి ఆసక్తిగా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల గురించి, మిషన్ కాకతీయ గురించి, తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హరీష్ రావు వివరించారు. దీనికి ఆమె స్పందిస్తూ రైతన్నలకు అందరూ అండగా ఉండాలని, రైతుకు కావాల్సిన నీరు మనం ఇస్తే, మనకు కావాల్సిన అన్నం రైతు ఇస్తాడని సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవి అన్నారు. కానీ దేశంలో రైతుల పరిస్థితి బాగా లేదని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తాము ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని ఆమె తెలిపారు.
see also : బోయింగ్ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..!
తమ మఠం నుంచి అందరికీ మంచి ఆరోగ్యం, మంచి వైద్యం అందించడం, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం కోసం అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణలో కూడా 20 గ్రామాలను దత్తత తీసుకుంటానని వెల్లడించారు. తెలంగాణలో ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం అమలు చేయడం మంచి నిర్ణయమన్నారు. బహిరంగ మల విసర్జన లేని ప్రాంతంగా సిద్దిపేట నియోజకవర్గం చరిత్రలో నిలిచిందని, తెలంగాణ అంతటా ఇదే ఒరవడి కొనసాగాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రజలకు మంచి విద్య, వైద్యం అందించడానికి పాలకులు కృషి చేయాలని చెప్పారు.
see also :పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్
సత్యమార్గం, శాంతి మార్గమే ప్రధానం: హరీష్ రావు
మాతా అమృతానందరమయి మఠం సందర్శించిన సందర్బంగా హరీష్ రావు అక్కడి భక్తులతో మాట్లాడారు. ఇప్పుడు సమాజానికి కావల్సింది శాంతి మార్గం, సత్య మార్గమే అన్నారు. ఈ సన్మార్గాన్ని అందిస్తున్నందునే సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవిని దేశమంతా అమ్మగా పిలుస్తున్నదన్నారు. ఆమె మానవత్వమే దైవత్వంగా కొనియాడబడుతున్నదన్నారు. అమ్మ చేసిన సేవ, అమ్మ చూపిస్తున్న ప్రేమ మానవ జాతికి మంచి సందేశమన్నారు. వత్తిడీని జయించడానికి శాంతి, సహనం ఎంతో ప్రధానమన్నారు. తోటి మానవుడి హితం కోరి చేసే పనులే మనల్ని చరితార్థులను చేస్తాయన్నారు. ఈ దిశగా సమాజంలో పరివర్తన తేవడానికి అమ్మ చేస్తున్న కృషి తప్పక ఫలిస్తుందని హరీశ్ అన్నారు.