ప్రముఖ స్టార్ హీరోయిన్ ,సీనియర్ నటి ,దాదాపు ఐదు దశాబ్దాలు పాటు ఇటు అందంతో అటు చక్కని అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి గత శనివారం రాత్రి పదకొండున్నరకు దుబాయ్ లో ప్రముఖ హోటల్ లో మృతి చెందిన సంగతి తెల్సిందే.ఐదు రోజుల నుండి ఏ ఛానల్ చూసిన ..ఎక్కడ చూసిన ..దేశంలో ఏ ఒక్కర్ని కదిలిచ్చిన మాట్లాడే విషయం శ్రీదేవి మరణం గురించే .అయితే ఈ నేపథ్యంలో నటి శ్రీదేవి మరణ వార్త తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జతిన్ వాల్మికీ అనే శ్రీదేవి వీరాభిమాని ముంబై వచ్చాడు .
ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అభిమాన నటికి కడసారి వీడ్కోలు పలకడానికి వచ్చాను .ఆమె నటి కంటే మంచి మనస్సున్న వ్యక్తిగా అభిమానిస్తున్నట్లు ఆయన తెలిపాడు.ఇంకా మాట్లాడుతూ నేను ఒక అంధుడును ..అందుకే శ్రీదేవి ను కానీ ఆమె సినిమాలను కానీ చూడలేకపోయిన ఆమె మంచితనాన్ని మాత్రం చూశాను .గతంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నటి శ్రీదేవిని కలిశాను .
ఆ సమయంలో నా సోదరుడికి బ్రెయిన్ ట్రుమార్ ఉందని సాయం చేయాలనీ కోరాను.అంతే ఏ మాత్రం ముందు వెనక ఆలోచించకుండా..నేను చెప్పింది నిజమా ..కాదా అని తెలుసుకోకుండా లక్ష రూపాయల చెక్ ను అందజేశారు.దీంతో నటి శ్రీదేవి చేసిన సాయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం చికిత్సకు అయిన ఖర్చులో ఒక లక్ష తగ్గించారు .ఆమె కారణంగా నా సోదరుడు ప్రాణాలతో ఉన్నాడు .అంతటి గొప్ప వ్యక్తిని నేను కళ్ళారా చూడకపోయిన కానీ ఆమె మంచితనాన్ని చూశాను అని అతను తీవ్ర ఉద్వేగంతో మాట్లాడటం అక్కడ ఉన్నవారిని కదిలించేసింది .