కాంగ్రెస్ బస్సు యాత్ర ఆలీబాబా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్.. ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగల్లా ఉందని చమత్కరించారు. తుంగతుర్తి ప్రగతి సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ శుభదినమన్నారు. ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టేందుకు మిషన్ భగీరథను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 175 జనావాసాలకు మంచినీళ్లు ఇస్తున్నామన్నారు. రుద్రమదేవి చెరువు, వెంపటి చెరువును పూర్తి చేస్తమన్నారు. సమైక్య రాష్ట్రంలో నత్తలు కూడా సిగ్గుపడేలా ఎస్‌ఆర్‌ఎస్‌పీ పనులు జరిగినయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు పారిస్తున్నమన్న మంత్రి… సమస్యలను అధిగమిస్తూ ప్రగతి వైపు నడుస్తున్నమన్నారు. బస్సు యాత్ర చేసేవాళ్లలో ప్రతి ఒక్కరిపై కేసులు ఉన్నాయని మంత్రి తెలియజేశారు.
see also :సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా..ఎర్రోళ్ల
see also :మరోసారి రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి అనుచరులు..
ఆంధ్రాలో కలిసినప్పుడు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేదు. నల్గొండ జిల్లా నేతల వల్లే ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడ్డరు. 15 ఏండ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి ఏనాడు కూడా ఫ్లోరైడ్ బాధితులను పట్టించుకోలేదు. తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వనన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీసిన పాపాన పోలేదు. 24 గంటల కరెంట్ వస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కడుపులు మండుతున్నయి. ఒకప్పుడు ఎరువుల కోసం ఎర్రటి ఎండలో నిలబడాల్సి వచ్చేది. రూ. 17 కోట్ల రుణాలు మాఫీ చేసి రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించిన ఘనత సీఎం కేసీఆర్‌ది. రైతులకు పెట్టుబడి ఇస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. పేదల కన్నీళ్లు తుడవడానికే ఈ ప్రభుత్వం వచ్చింది. రైతులకు రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించినం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని దొంగ యాత్రలు మొదలు పెట్టారు. 55 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేదు. అని కేటీఆర్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.