వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నేటితో 100రోజులకు చురుకుంది. గత ఏడాది కడపజిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది.
See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!
ఇక ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏంటంటే జగన్ పాదయాత్ర ఇక్కడే సెంచరీ కొట్టడం విశేషం. ఇక వందరోజుల పాదయాత్రలో జగన్ ఇప్పటికే 13 సెంచరీలు అనగా 1350 కి.మీ నడిచారు. ఇప్పటికే కంప్లీట్ అయిన 5జిల్లాలతో పాటు.. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కలిపి 43 నియోజక వర్గాల్ని జగన్ కవర్ చేశారు. మొత్తం 99 రోజుల కాలినడకలో 39 బహిరంగ సభల్లో ప్రసంగించిన జగన్ నేడు 40వ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
See Also:నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే -AP Cm..!
ఇక జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టనష్టాలను డైరెక్ట్‌గానే తెలుసుకుంటూ.. వాటినే హామీలుగా ప్రకటిస్తున్నారు. మరోవైపు అధికార టీడీపీ ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక తాజా రగడ ఏపీ ప్రత్యేకహోదా పై అయితే జగన్ వరుస ప్రకటనలు చేసి ఏపీ రాజకీయాలను వేడెక్కించారు. అంతే కాకుండా ప్రత్యేక హోదాకు సంబంధించి కీలకమైన విషయాలు, నిర్ణయాలన్నింటినీ ప్రజల మధ్యే ప్రకటించారు జగన్. ఇక కొద్ది రోజుల్లో ఏపీలో ప్రారంభమయ్యే పార్లమెంట్‌లో వైసీపీ చేయబోయే ఆందోళనల నుంచి మూకుమ్మడి రాజీనామాల విషయాన్ని కూడా ప్రజల సమక్షంలోనే జగన్ ప్రకటించారు.
See Also:జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!
ఏపీలో చంద్రబాబు అవినీతి పాలన గురించి వివరిస్తూ.. వాటి పై విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు తన పార్టీ జెండా, ఎజెండాను ప్రజలకు సుత్తిలేకుండా చెబుతున్నారు. తను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానో స్పష్టంగా చెబుతూ… రాష్ట్ర స్థాయిలో ఇచ్చే హామీలను వివరిస్తూనే… తన పర్యటనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పనుల పై కూడా జగన్ స్పందిస్తున్నారు.