ప్రస్తుతం సోషల్ మీడియా తీసుకున్న ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్న ..ఆఖరికి యావత్తు భారతదేశాన్ని తీసుకున్న హాట్ టాపిక్ సీనియర్ నటి శ్రీదేవి అకాలమరణం.శ్రీదేవి గత శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు బాత్రూం లో బాత్ టబ్ లో ప్రమాదశావత్తు పడి మృతి చెందారు అని నిన్న మంగళవారం దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు.అయితే జాతీయ మీడియా కానీ స్థానిక మీడియా కానీ దేశంలో సమస్యలే లేవన్నట్లుగా శ్రీదేవి మరణంపై పలు కథనాలను ప్రసారం చేస్తుంది.
See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..!
ఈ క్రమంలో నటి శ్రీదేవి మరణించే రోజు ముందు అంటే శుక్రవారం దేశంలోనే అత్యధిక అక్షరాస్యతను సాధించిన రాష్ట్రంగా ఉన్న కేరళలో తినడానికి తిను బండరాలను దొంగిలించాడు అనే ఒకే ఒక కారణంతో మతి స్థిమితం లేని ఒక యువకుడ్ని కొట్టి మరి రాక్షసంగా చంపేశారు.అంతే కాకుండా మానవత్వం లేదని నిరూపిస్తూ ఒకవైపు కొడుతుంటే మరోవైపు సేల్పీలు దిగాడు ఒక యువకుడు.
See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..!
ఈఘటనను మీడియా అంత మరిచిపోయిన కానీ కేరళ రాష్ట్ర న్యాయసేవల సంస్థ ఇంచార్జ్ అయిన జస్టీస్ కే సురేంద్ర మోహన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు లేఖ రాశాడు .మన సమాజానికి ,మీడియాకు పట్టని ఈ ఘటన రాష్ట్రానికి సిగ్గుచేటు.అక్షరాస్యత వందశాతం ఉన్న రాష్ట్రంలో జరగడం మనం సిగ్గుతో తల దించుకోవాలి అని ..మీరు జోక్యం చేస్కోవాలి అని హైకోర్టును కోరారు.దీంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా భావించి కేసును సుమోటోగా తీసుకొని విచారించాలని హైకోర్టు చీఫ్ జస్టీస్ అంటోని డొమినిక్ తీర్పునిచ్చారు ..