అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్రబాబు.. రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!! ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి గత సాధారణ ఎన్నికల్లో ఏపీ ప్రజలకు అమలుకాని హామీలను ఎరగావేసి.. బీజేపీతో జతకట్టి మరీ సీఎం కుర్చీని అధిష్టించారు చంద్రబాబు. అయితే, ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు, స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ ఇలా టీడీపీ, బీజేపీలు కలిసి ఏపీ ప్రజలను నిలువునా ముంచిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరుకు కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్‌కు ఇచ్చిన నిధులపై అటు కేంద్ర మంత్రులతోపాటు.. ఇటు రాష్ట్ర బీజేపీ మంత్రులు, నేతలు కూడా మీడియా సాక్షిగా వివరాలను బయటపెట్టిన విషయం తెలిసింద.
see also : సోది చెప్పకు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!
see also : జగన్ భయంతోనే చంద్రబాబు హడావుడి..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
మొన్నటికి మొన్న ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులోనే మరుగుదొడ్లు నిర్మిస్తామంటూ టీడీపీ నేతలు రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అలాగే, నీరు చెట్టు నిధులు రూ.500 కోట్లను స్వాహా చేశారన్నారు. ఇందులో నెల్లూరు టీడీపీ నేతలది, ముఖ్యమంత్రి చంద్రబాబుల వాటా ఎంతో తేలాల్సి ఉందన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ సర్కార్ ప్రత్యేక హోదాతో సమానంగా రూ.3 లక్షలా 30 వేల కోట్లు ఇస్తే.. ఆ నిధులన్నింటినీ చంద్రబాబు సర్కార్ ఎలా ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
see also : జగన్‌పై కేసులు పెడతాం :మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ చంద్రబాబు సర్కార్‌కు మరో నోటీసు పంపినట్లు సమాచారం. అందులో గత సంవత్సరంలో ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి మంజూరు చేసిన 3,300 కోట్ల రూపాయల కు ఖర్చుకు సంబంధించి లెక్కలు చూపాలని కేంద్ర ప్రభుత్వం ఆ నోటీసులు పంపిందని, అయితే, చంద్రబాబు ఆ లేఖలో 3,300 కోట్ల రూపాయల కు ఖర్చుకు సంబంధించిన అంశాలను నింపడంలో తడబాటు పడ్డట్టు ఏపీ మంత్రుల లోగుట్ట.