అతిలోక సుందరి, ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరన్న విషయం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. యావత్ సినీ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురై కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉండగా శ్రీదేవి మరణానికి సంబంధించి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకు తోడుగా బాత్ టబ్‌లో శ్రీదేవ ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ ఉందనేది అర్ధం అవుతుంది.
see also : గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం అతి దారుణంగా..!!
see also : సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు..!!
దుబాయ్‌లో జరిగిన వివాహ వేడుకలో అందరితో కలిసి ఆడిపాడిన శ్రీదేవి హఠాత్మరణం వెనుక మిస్టరీ ఏమిటి? శ్రీదేవిది సహజ మరణమా? ఆత్మహత్యా? లేక హత్యా..? రాత్రి 9 గంటల సమయంలో విగత జీవిగా పడి ఉన్న శ్రీదేవిని చూసిన బోనీ కపూర్ ఆమెను ఆస్పత్రికి తరలించడంలో ఎందుకు ఆలస్యం చేసినట్టు..? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.
see also : శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..?
ఇదిలా ఉండగా శ్రీదేవి మరణానికి సంబంధించి బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణించింది గుండెపోటుతో కాదని, హత్య చేశారని, దుబాయ్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో ప్రతీ హోటల్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయని, అలాంటి అంత పెద్ద హోటల్లోనూ సీసీ టీవీ కచ్చితంగా ఉంటుందని, ఆ పుటేజీలను పరిశీలిస్తే అసలు నిందితులు ఎవరో బయటపడే అవకాశం ఉందన్నారు.