దరువు.కామ్ కార్టూనిస్ట్, తెలంగాణవాది నెల్లుట్ల రమణ రావు చిత్రాలు తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రతిబింబించాయని పలువురు ప్రశంసించారు. తన కుంచెతో తెలంగాణ సమాజాన్ని మరోమారు పలువురికి చాటిచెప్పారని కితాబు ఇచ్చారు. రవీంద్రభారతిలో తన చిత్రాలతో రమణ ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇవాళ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం, కరణ్ కాన్సెప్ట్, దరువు అధినేత చెరుకు కరణ్ రెడ్డి తిలకించారు.
see also : సీఎం కేసీఆర్‌కు దరువు అధినేత జన్మదిన శుభాకాంక్షలు..!
ఈ సందర్భంగా దిలీప్ కొణతం, కరణ్ రెడ్డి చిత్రకారుడు రమణను ప్రశంసించారు. తెలంగాణ పల్లె జీవనం నుంచి మొదలుకొని స్వరాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారని కొనియాడారు. హాస్యం, వ్యంగ్యం, రౌద్రం, ఆప్యాయత వంటివన్నీ రమణ చిత్రాల్లో ప్రస్పుటంగా కనిపించాయని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన చిత్రకారుల్లో రమణ ప్రత్యేకతకను కలిగి ఉన్నారని వారు కితాబు ఇచ్చారు.
see also :కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!