తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి కే తారకరామారావు మరోమారు గళం విప్పారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఏకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రికే లేఖ రాశారు. ఇటీవలి కాలంలో బుందేల్ ఖండ్, చెన్నాయ్- బెంగళూర్ ప్రాంతాలకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు. తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి ఒక లేఖ రాశారు.
తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటు కోసం తెలంగాణకు అన్ని రకాల అర్హతలున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా తెలంగాణ స్థానిక యువతకు మరింత ఉపాది లభిస్తుందన్నారు. గత 5 దశాబ్దాలుగా అద్భుతమై ఏయిరోస్పెస్ అండ్ ఢిపెన్స్ ఈకోసిస్టమ్ తెలంగాణలో ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో రెండు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్లను ప్రకటించిన కేంద్రం, అన్ని విధాల అనువైన పరిస్ధితులున్నప్పటికీ తెలంగాణను విస్మరించడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నూతన రాష్ర్టానికి ఈ కారిడార్ల కేటాయిస్తే ఇక్కడి యువతకు అనేక ఉద్యోగా ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉన్న ఏయిరో స్పేస్ డిఫెన్స్ అనూకూల వాతావరణాన్ని మంత్రి తన లేఖలో వివరించారు. ఈకో సిస్టమ్ ఉన్న చోట ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయిస్తేనే మరిన్ని పెట్టుబడులు వస్తాయని మంత్రి కే తారక రామారావు తెలిపారు.
see also : కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
తెలంగాణ వ్యూహాత్మక ప్రదేశంలో ఉందని, ఇక్కడి డీఆర్‌డీవో, అర్‌సీఐ, డీఆర్‌డీఎల్, బీడీఎల్, మిధాని, హెచ్‌సీఎల్ వంటి అనేక రక్షణ రంగ సంస్ధలు ఇక్కడే ఉన్నాయని మంత్రి తన లేఖలో గుర్తు చేశారు. దీంతోపాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, హెచ్ బియల్, అస్ర్టా మెదలయిన ప్రయివేట్ రంగంలోనూ పలు సంస్ధలు ఏయిరో స్పేస్ మరియు ఢిపెన్స్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. అయా సంస్ధలు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు భాగస్వాములుగా ఉన్నాయని, ఇలాంటి చోటనే ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ ఎర్పాటు చేస్తే పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి విమాన సౌకర్యం ఉన్న శంషాబాద్ అంతర్జాతీ విమానాశ్రయం, వరంగల్, బేగంపేట, దుండిగల్, హకీంపేటలో విమానాశ్రమ సదుపాయం ఉందన్నారు. దీంతోపాటు ఇతర నగరాలకు లేని ఏనిమిది లేన్ల హైస్పీడ్ అవుటర్ రింగ్ రొడ్డు ఉందన్నారు. తెలంగాణకు ఉన్న మౌళిక వసతులతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఏయిరోస్సేస్ ఢిపెన్స్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా పెట్టుకున్నదన్నారు. ఈ మేరకు అధిబట్ల, జియంఅర్ విమానాశ్రానికి అనుకుని ఉన్న రెండు పార్కుల్లో ఇప్పటికే ఈ రెండు రంగాల్లో ఉత్పత్తులు కొనసాగుతున్నాయన్నారు. దీంతోపాటు ఎలిమినేడులో మరోపార్కు, మెదక్ లోని నిమ్జ్ లో ప్రత్యేకంగా మరోక ఏయిరో స్పేస్ ఢిపెన్స్ క్లస్టర్ ను ఎర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. దీంతోపాటు నగరంలో ఢిఫెన్స్ ఇంక్యూబేటర్ ఎర్పాటును సైతం ప్రభుత్వం పరిశీలీస్తుందన్నారు. ఇంతలా ప్రభుత్వ ఢిపెన్స్ తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.
see also :2019లో హిస్టరీ రిపీట్స్..!! ”ఇది ఫిక్స్”
దీంతోపాటు అంతర్జాతీయ స్ధాయి కంపెనీలైన బోయింగ్, లాకీడ్ మార్టిన్, సికోర్స్కీ వంటి కంపెనీలు హైదరరాబాద్ నగరాన్ని తమ తయారీ కేంద్రాలుగా ఎంచుకున్న విషయాన్ని తెలిపారు. ప్రాట్ అండ్ విట్నీ వంటి సంస్దలు తమ ఇంజిన్ శిక్షణ కేంద్రంగా నగరాన్ని ఎంపిక చేసుకుందన్నారు. తెలంగాణలో 26 యూనివర్సీటీలు, 700లకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, సూమారు 280 పాలిటెక్నిక్ కాలేజీలున్నాయని, వీటి ద్వారా ప్రతి ఏటా టెక్నికల్ పరిజ్ఝానం ఉన్న యువకులు బయటకు వస్తున్నారన్నారు. నగరంలో కనీసం 1000 యంయస్ యంఈలు ఢిపెన్స్ మరియు ఏయిరో స్సేస్ రంగంలో పనిచేస్తున్నాయని, అనేక భారత రక్షణ, అంతరిక్ష కార్యక్రమాల్లో వీటికి భాగసామ్యం ఉందని, ఇలా అన్ని విధాలుగా తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించేందుకు అన్ని అర్హతలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానూకూలంగా స్పందించి తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కోరారు.
see also : సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్‌కు తీవ్ర అన్యాయం.. సీఎం కేసీఆర్