వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికి 99వ రోజు ప్రకాశం జిల్లాలో ముగిసింది.ఈ రోజు ప్రజసంకల్ప యాత్రలో వై ఎస్ జగన్ 16.2కిలోమీటర్ల నడిచారు.కాగా ఇప్పటివరకు జగన్ మొత్తం 134౦ కిలోమీటర్ల నడిచారు.
see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
ఈ క్రమంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు రేపు వందో రోజు.. ఉప్పలపాడు శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభం కానుంది. అక్కడ నుంచి వెల్లురు క్రాస్, మర్రిచెట్లపాలెం, బుదవాడ, రామతీర్థం మీదుగా చీమకుర్తి వరకు ఆయన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.