తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించబడిన నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిశారు .ఈ సందర్భంగా మంత్రి జగదీష్ మాట్లాడుతూ ఎంపీ గుత్తాను మర్యాదపూర్వకంగా కలిశాను .ఇటివల రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపాను .రైతులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేసి ..బంగారు తెలంగాణగా నిర్మాణం చెందటంలో అందరు భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలనీ కోరినట్లు మంత్రి తెలిపారు .