సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో తన మేనల్లుడి వివాహానికి హాజరై శనివారం రాత్రి పదకొండున్నరకు గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెల్సిందే.అయితే నటి మృతిపై దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు మాత్రం ఆమె బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు అని తేలింది.ఈ విషయం మీద దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు .
అయితే నటి శ్రీదేవిది సహజ మరణం కాదు .ముమ్మాటికి హత్యే అని అంటున్నారు బీజేపీ సీనియర్ నేత ,ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామీ.ఆయన మాట్లాడుతూ నటి శ్రీదేవికి నాకు తెల్సినంతవరకు మద్యం అలవాటు లేదు.డాక్టర్లు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు అని చెబుతున్నారు.
కానీ ఫోరెన్సిక్ రిపోర్టు మాత్రం ప్రమాదశావత్తు బాత్ టబ్ లో పడి మరణించారు అని ప్రకటించింది.ఇలాంటి తరుణంలో వైద్యులు చెప్పిన అంశాల మీద ,రిపోర్టు మీద చాలా అనుమానాలు ఉన్నాయి .అయితే ప్రస్తుత సమాచారాన్ని బట్టి నటికి గుండెపోటు రావడంతో మరణించలేదు.ఇది ముమ్మాటికి హత్యలా అనిపిస్తుందని..ఈ మొత్తం వ్యవహారంలో సీసీ టీవీ ప్యూటేజ్ ఏమైంది ..డాక్టర్లు ఒకలా చెప్పడం ..ఫోరెన్సిక్ రిపోర్టు మరొకలా ఎందుకుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .