ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ప్రకాశంజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలతోపాటు ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో నడుస్తున్నారు. ఇలా ప్రజలు తోడవడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి కొండంత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు.
see also : ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ..!
అయితే, పాదయాత్రలో భాగంగా ఓ మీడియా ఛానెల్‌తో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షరతులు లేని వైద్యాన్ని ప్రజలకు అందిస్తారా..? అలాగే కరప్షన్ లేకుండా చేస్తారా..? అన్న ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిస్తూ.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో వ్యవస్థను భ్రష్ఠు పట్టించారు. చంద్రబాబు మాట ల్లో ఎక్కడా కూడా నిజాయితీ లేదు. పాలన ఎలా చేయాలో.. వీళ్లందరికీ నేను చేసి చూపిస్తానంటూ సమాధానమిచ్చారు వైఎస్ జగన్.
ముఖ్యమంత్రిగా చంద్రబాబుగా ఉన్న సమయంలో నాడు మీ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేశారు. నేడు మీరు చేస్తున్నారు. నాటికి, నేటికి ఏమన్నా తేడా ఉందా..? అన్న ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ.. 2019లో హిస్టరీ రిపీట్స్ అంటూ సమాధానం ఇచ్చారు.
పాదయాత్రలో మీరు మరిచిపోలేని సంఘటన ఏదైనా మీకు ఎదురైందా..? అన్న ప్రశ్నకు ప్రతీరోజు ఒక మర్చిపోలేని సంఘటనే ఎదురవుతుందని సమాధానమిచ్చారు.
see also : నటి శ్రీదేవికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి ..!
వ్యవస్థను భ్రష్టుపటించాడు. నిజాయితీ లేదు. మాటలలో ఎలా చేయాలో వీళ్లందరికీ నేను చేసి చూపిస్తా.. మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఎదురైందా..? ప్రతిరోజు.. అంటే వచ్చే ఎననికల్లో ప్రత్యేక హోదా ఏ పార్టీ హామీ ఇవ్వకపోతే..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. అసలు అతను ఏం ప్యాకేజీ ఇచ్చాడయ్యా..? ఏం కనబడుతుందయ్యా..? నీకు అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అది ప్యాకేజీ కాదు.. క్యాబేజీ నీ చేతిలో పెట్టాడయ్యా చంద్రబాబూ అంటూ వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగదంటూ ఇంటర్వ్యూను ముగించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.