ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి ఇస్తున్న లక్షల కోట్ల నిధులను తమ స్వార్ధం కోసం పక్కదారి పట్టించడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చాణక్యతకు పదునుపెట్టారని.. చంద్రబాబు లక్షల కోట్ల అవినీతిపై కత్తి మహేష్ ఏకిపారేశారు.
see also : ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!
see also : హోటల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?
కాగా, ఇవాళ కత్తి మహేష్ ట్విట్టర్ వేదికగా ఏపీలో చంద్రబాబు సర్కార్ పాలనపై తన అభిప్రాయాన్ని చెప్పారు. విదేశీఈ పెట్టుబడుల పేరుతో వంద కోట్ల ప్రజల ధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేయడం దారుణమన్నారు. లక్షల కోట్ల ఎంఓయూలపై సంతకం చేశామని, ప్రగల్భాలు పలుకుతూ.. ప్రాజెక్టుల కోసం కేంద్ర మంజూరు చేస్తున్న వందల కోట్ల నిధులను చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి పక్కదారి పట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు నిర్వహించే కార్యక్రమాల ద్వారా లక్షల కోట్ల అప్పులు మాత్రమే మిగులుతున్నాయని, సొమ్ము ప్రజలది… సోకు చంద్రబాబుది అన్నట్లు టీడీపీ పాలన కొనసాగుతోందన్నారు.
అయితే, ఇటీవల కాలంలో బీజేపీ నేత సురేష్ రెడ్డి మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్ పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్రముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల కోట్ల 434 కోట్లు పెరిగిందన్నారు. ఈ లెక్క గత డిసెంబర్ వరకేనని, జనవరి, ఫిబ్రవరిలో ఇంకెంత అప్పు చేశారోనంటూ అనుమానం వ్యక్తం చేశారు.