తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజా చైతన్య బస్సు యాత్రకు ఈ రోజు ( సోమవారం ) శ్రీకారం చుడుతోంది.టీ కాంగ్రెస్ ముఖ్యనేతలంతా కలసికట్టుగా పాల్గొంటున్న బస్సు యాత్ర చేవెళ్ల బహిరంగసభతో ప్రారంభం కానుంది. మొదటి విడత యాత్రను తొమ్మిదిరోజులపాటు నిర్వహించనుంది.
see also : ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి
2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల నుంచే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఈసారి కూడా అక్కడనుంచే ప్రారంభిస్తోంది. తెరాస ఎన్నికల హామీలు, రాష్ట్రం అప్పులు, మానవ హక్కుల ఉల్లంఘన, దళిత, గిరిజన, బీసీ బడుగువర్గాలపై దాడులు సహా పలు అంశాలను ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తెలంగాణ వ్యతిరేకశక్తులకు ప్రాధాన్యం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిపారు.
see also :మోత్కుపల్లిపై చర్యలకు జంకుతున్న బాబు..కారణం ఇదే
ప్రజా చైతన్య యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి ఆర్.సి.కుంతియా, సీఎల్పీనేత జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్‌అలీతోపాటు పార్టీ సీనియర్‌నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొంటారు.
see also : రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే