జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అటు పొలిటికల్ కెరియర్‌తోపాటు, ఇటు సినీ కెరీర్‌కు శుభం కార్డు పడిపోయినట్టేనా..!! ఇప్పుడిదే అంశం సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ షాకింగ్ డెషీసన్ తీసుకున్నారా..? ఇకపై రాజకీయాలు వదిలేసి తన అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాలపై దృష్టి పెట్టనున్నారా..? అందుకే తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also : టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుత హీరోలలో శ్రీదేవికిష్టమైన హీరో ఎవరంటే ..!
see also : శ్రీదేవి లైఫ్‌లో బ్లాక్ డేస్.. మిధున్ చక్రవర్తితో శ్రీదేవి వివాహం.. ఇప్పటికీ ఓ రహస్యమేనా..?
అయితే, అటు రాజకీయాలు, ఇటు సినిమాలు ఇలా రెండు పడవల ప్రయాణం మంచిది కాదని నిర్ణయించుకున్న పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన వెంటనే జనసేన సైనికులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, పవన్ కల్యాన్ పూర్తి రాజకీయాల్లోకి రాకముందు తన చివరి చిత్రం అజ్ఞాతవాసి అని, ఆ సినిమా తరువాత ఇక తన జీవితమంతా ప్రజల మధ్యనే ఉంటుందంటూ ప్రకటించారు జనసేన అధినేత. అలా ప్రకటన చేశాడో లేదో తమ కులదైవమైన ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఖమ్మం, కరీంనగర్, అనంతపురం జిల్లాల్లో పర్యటనలు కూడా చేశాడు.
see also : రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ.. సీఎం కేసీఆర్
ఇదిలా ఉండగా.. ఎప్పుడూ బిజీగా ఉండే పవన్ కల్యాణ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తాను సరిపడననుకున్నాడో ఏమో తెలీదు కానీ.. ప్రజల కోసమే జేఎఫ్‌సీని ఏర్పాటు చేస్తున్నానంటూ ప్రకటించి.. జేఎఫ్‌సీలో తాను లేనంటూ తప్పుకున్నాడు. అయితే, అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కల్యాణ్ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఏ సినిమాకు రానన్ని విమర్శలు అజ్ఞాతవాసికి వచ్చాయంటే .. ఆ చిత్రం ఎంత ఫ్లాపో అర్థంచేసుకోవచ్చు. దీంతో పవన్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశకు లోనయ్యారు కూడాను.
See Also:ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!
ఈ నేపథ్యంలో పవన్ కల్యాన్ మళ్లీ మొఖానికి రంగేసుకోనున్నారన్న వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. అయితే, గతంలో ప్రముఖ దర్శకుడు ఏఎం రత్నం పవన్ కల్యాణ్‌కు కథ చెప్పాడని, ఆ కథ ఇప్పుడు స్ర్కిప్ట్ దశలోనే ఉందని, త్వరలోనే వీరిద్దరి కాంబోలో చరిత్ర అనే టైటిల్‌తో ఓ చిత్రం సెట్స్‌పైకి ఎక్కనుందని సమాచారం. అలాగే, పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించక ముందే ఓ చిత్రానికి సైన్ చేశాడన్న వార్త సోసల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వార్త.. పవన్ రాజకీయం కూడా చిరంజీవిలా అవుతుందేమోననన్న భయం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
See Also:ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!