తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ – గవర్నెన్స్ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు.
see also : హాట్సాఫ్ కేసీఆర్..!
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు అందించొచ్చని స్పష్టం చేశారు.పౌర సేవల కోసం ఆర్టీఎ ఎం వ్యాలిట్ తెచ్చామని..కొద్ది రోజుల్లోనే 1.3 మిలియన్ ప్రజలు ఎం వ్యాలెట్ డౌన్ లోడ్ చేసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పౌర సేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.టీ వ్యాలెట్ ద్వారా సులభమైన పద్దతిలో లావాదేవీలు జరుగుతున్నాయన్నారు.
see also :హోటల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?
టీఎస్ ఐపాస్ తో 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.ఈజ్ అఫ్ డుయింగ్ బిజినెస్ లో అగ్రస్థానం లో ఉన్నామన్నారు.బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలోనూ అనుమతులకు సులభమైన విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు.86 సంవత్సరాల తరువాత భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు.