టీం ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు ,మాజీ కెప్టెన్ ,ప్రస్తుత యువభారత్ ప్రధాన కోచ్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు పలికారు.ఇటివల అండర్ 19 వరల్డ్ కప్ లో యువభారత్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.
see also :బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?
ఈ క్రమంలో క్రికెట్ బోర్డు బీసీసీఐ యువభారత్ జట్టులోకి ఆటగాళ్ళకు .జట్టు సిబ్బందికి నజరాలు ప్రకటించింది.అందులో భాగంగా ఒక్కో అటగాడికి ముప్పై లక్షలు .కోచ్ అయిన ద్రావిడ్ కి యాబై లక్షలతో పాటుగా ఇతర సిబ్బందికి ఇరవై లక్షలు ప్రకటించింది.దీనిపై అప్పట్లో ద్రావిడ్ మాట్లాడుతూ ప్రపంచ కప్ విజయం అందరి సహకారంతో కృషితో గెలిచాం.
see also :శ్రీదేవి మరణంపై దుబాయ్ పోలీసులు షాకింగ్ రిపోర్టు …!
అలాంటప్పుడు అందరికి సమానంగా ఇవ్వాలి కానీ ఇలా తేడాలు ఎందుకు అని బహిరంగంగానే విమర్శించారు.దీన్ని మనసులో పెట్టుకున్న బీసీసీఐ ద్రావిడ్ అభ్యర్థనను గౌరవించి అందరికి సమానంగా నజరానాలను ప్రకటించింది.దీంతో అందరు ద్రావిడ్ పై ప్రశంసలు కురిపించారు.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ రాహుల్ ను ఆకాశానికెత్తారు .కోచ్ కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ద్రావిడ్ అంటే నాకు ఎంతో ఇష్టం అని ఆయన ట్వీట్ చేశారు.
see also :అది చంద్రబాబు రక్తంలోనే లేదు-శిల్పా చక్రపాణి రెడ్డి..
This is why Rahul Dravid is not only my favourite cricketer but also my favourite person as well ? https://t.co/xsSas8wdSV
— KTR (@KTRTRS) February 26, 2018