మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.త్వరలో రాజకీయ పార్టీను ప్రకటించబోతున్న..తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రో కోదండ రాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.ఆగండి ఆగండి ..నిత్యం ఏదో ఒక కారణంతో టీఆర్ఎస్ పార్టీను విమర్శించే కోదండరాం ఆ పార్టీను పొగడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అసలు విషయానికి వస్తే ప్రో కోదండరాం డల్లాస్ పర్యటనలో ఉన్నారు.
see also : హాట్సాఫ్ కేసీఆర్..!
ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు ,పోరాటాలు ,ప్రజలలో నెలకొన్న అభద్రతాభావం ఇలా పలు కారణాలు ఎన్నికలకు దారితీస్తాయి అని అన్నారు.అసలు రాజకీయం అంటే మీడియాను కంట్రోల్ చేయడం ..డబ్బులు పెట్టి ఓట్లు కొని అధికారంలోకి రావడం కాదు అని అన్నారు.
see also : ఈ – గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు..కేటీఆర్
అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో నెలకొన్న సామాజిక పరిస్థితులు ,ఉద్యమం ,ఇతరత్రా కారణాల వలన టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది.ఏ లక్ష్యాలతో అయితే పార్టీ ఏర్పడిందో వాటిని సాధించడంలో సఫలమైంది.అందుకే ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు.ఇలా సమాజంలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా ఏర్పడిన పార్టీలను ..తీసుకున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తారు అనడానికి ప్రత్యేక్ష ఉదాహరణ టీఆర్ఎస్ పార్టీ అని ఆయన వివరించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది..