Home / SLIDER / కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్‌…పాకిస్తాన్‌పై డౌట్

కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్‌…పాకిస్తాన్‌పై డౌట్

బీజేపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డికి అనూహ్య‌మైన షాక్ త‌గిలింది. ఆయ‌న వెబ్ సైట్ హ్యాక్ అయింది. పైగా ఇది పొరుగుదేశ‌మైన పాకిస్తాన్ వాసుల ప‌ని అనే సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు. తగు చ‌ర్యల కోసం ఆయ‌న డీజీపీని కూడా ఆశ్ర‌యించారు. ఇదే విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు.

see also :మందుబాటిళ్ల‌తో బ‌య‌ట‌ప‌డిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో

see also :బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్‌..?

గత 12 సంవత్సరాలుగా రాజ‌కీయ జీవితంలో ఉన్న తను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు వెబ్‌సైట్‌తో ముందుకు వెళ్తుండ‌గా త‌న వెబ్‌సైట్ హ్యాక్ అయింద‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు కిష‌న్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. `మా వెబ్‌సైట్ నిన్న రాత్రి హ్యాకింగ్ గురైన విషయం మా దృష్టికి వచ్చింది. హ్యాకింగ్ జరిగిన ఆధారాలను బట్టిచూస్తే ఇది పాకిస్తాన్ కు సంబంధించిన వ్యక్తులు లేదా దేశ వ్యతిరేక శక్తుల పని అని మేం భావిస్తున్నాం. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి, ఐజీ ఇంటలీజెన్స్‌కు, హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్స్ డీసీపీకి ఫిర్యాదు చేశాం. ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సైబర్ చట్టాల ఆధారంగా పూర్తిస్థాయిలో దర్యాప్తుచేసి కఠినంగా శిక్షించాలి` అని కిషన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, ఇది నిజంగా పాకిస్తాన్ గానీ మరే ఇతర దేశ వ్యతిరేక శక్తుల ద్వారానే ఈ హ్యాకింగ్ జరిగి ఉంటే, దీనిపై అవసరమైతే కేంద్ర సహకారం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని త‌న లేఖ‌లో కిష‌న్ రెడ్డి కోరారు. కాగా, ప్ర‌స్తుతం ఆయ‌న వెబ్‌సైట్ స‌రిగానే ప‌నిచేస్తుండ‌టం విశేషం.

see also :శ్రీదేవి మృతదేహం అప్పగింత ఈ రోజు కాదు..?

see also :కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat