తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది.ఈ రోజు నుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలోని హెచ్ఐసీసీ లో ఈ – గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు జరగనుంది.ఈ సదస్సును కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి.
SEE ALSO :ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి
ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో ఈ-గవర్నెన్స్‌ను ఎలా విస్తృతం చేయాలనే దానిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.పలురాష్ట్రాల్లో అమలవుతున్న ఈ-గవర్నెన్స్ విధానాల గురించి తెలుసుకోవడంతోపాటు నూతన సాంకేతికతతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంపై ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు.
SEE ALSO :రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి, కేంద్ర వినియోగదారుల, ఆహా ర, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి సీఆర్ చౌదరి, ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, పలురంగాల నిపుణులు హాజరుకానున్నారు.
SEE ALSO :మోత్కుపల్లిపై చర్యలకు జంకుతున్న బాబు..కారణం ఇదే