వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దెబ్బ అధికార టీడీపీకే కాంకుండా, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా తగులుతోంది. జగన్ తన పాదయాత్రలో ఎదురవుతున్న ప్రజల సమస్యలనే అజెండాగా మార్చుకొని పక్కా హామీలు ఇస్తున్నారు. ఇక మరో ప్రధాన విషయం ఏంటంటే ఏపీలో తాజా రగడ ప్రత్యేకహోదా పై అయితే జగన్ మరింత దూకుడు ప్రదర్శింస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ అధికార పార్టీలో కల్లోలం సృష్టిస్తుండగా.. ఇప్పటికే ఏపీలో శిధిలావస్తకు చేరిన కాంగ్రెస్ పార్టీకి కూడా గట్టి షాకులే తగులుతున్నాయి. ఏపీలో 2004 నుండి 2014 వరకు ఏపీలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నాయకులు చాలామంది అడ్రస్ లేకుండా పోయారు. విభజన దెబ్బకి నాడు మంత్రులుగా, ఎంపీలుగా చెలామణి అయిన వారంతా ఒక్కసారిగా రాజకీయ క్షేత్రంలో కనపడకుండా పోయారు. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ రాజకీయ తెరపై అదృష్టి పరీక్షించుకునేందుకు ముందుకొస్తున్నారు.
see also : ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!
తాజాగా విశాఖ జిల్లాకు చెందిన పసుపులేటి బాలరాజు మరోసారి తెరపైకి వచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన… ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేశారు. ఇక 2014లో కాంగ్రెస్ తరపునే.. పాడేరు నుంచి పోటీచేసిన ఆయన ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆ ఓటమి దెబ్బకి.. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. మధ్యలో వైసీపీలో చేరదామని భావించినా.. ఎందుకో కార్యాచరణ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా మ్యాటర్ ఏంటంటే వైసీపీలో జాయిన్ అవుతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల వైసీపీ నుండి జంప్ అయిన గిడ్డి ఈశ్వరి పాడేరు నియోజక వర్గంలో పోటీ చేసుందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేతలతో కూడా చర్చించారని సమాచారం. అయితే బాలరాజును పార్లమెంటుకు పంపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే.. కొత్తపల్లి గీత హ్యాండ్ ఇవ్వడంతో గతంలో మంత్రిగా పనిచేసిన బాలరాజు ఎంపీగా బరిలోకి దిగితే వైసీపీకి లాభం చేకూరుతోందని వైసీపీ సీనియర్లు జగన్‌తో చెప్పినట్టు సమాచారం. మరి ఇదే విషయాన్ని బాలరాజుకు కూడా చెప్పారని, అయితే ఆయన శాసనసభకే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. మరి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధిష్టానం బాలరాజు ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గీయులు భావిస్తున్నారు.
see also : ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!
see also :పవన్ కల్యాణ్‌పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!!