ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద వైజాగ్ సీఐఐ సదస్సు సాక్షిగా ప్రశంసల వర్షం కురుస్తుంది.ఒక రాజకీయ నేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నేటితో నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మంత్రులు ,కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలో మంత్రులు యనమల ,దేవినేని ,కోల్లు రవీంద్ర,కళా వెంకట్రావు ,ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబును కల్సి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు.ఈ క్రమంలో రాజకీయంగా ఆయన మరింత స్థాయికి ఎదగాలని ..భవిష్యత్తులో తనను నమ్ముకున్నవారికి మరింత సేవలు చేయాలనీ వారు కోరారు .
