ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు తప్పదా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారా..? అన్న ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ..తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని, నన్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హత్య చేయించేందుకు యత్నిస్తున్నాడని, అందుకు తాను తన వాదనలను ప్రత్యేకంగా వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
see also : మోత్కుపల్లిపై చర్యలకు జంకుతున్న బాబు..కారణం ఇదే
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా చంద్రబాబును అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందని, త్వరలో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపుతారన్న సంకేతాలు గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్త నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏ4 నిందితుడు మత్తయ్య అప్రూవర్‌గా మారి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై నోరు విప్పితే ఆ తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉండనున్నాయి. మత్తయ్య స్టేట్మెంట్ ఆధారంగా ఏపీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసేందుకు ఆధారాలు దొరుకుతాయి. అయితే, చంద్రబాబును అరెస్టు చేయడం అంత ఈజీ కాదని, ఎలాగోలా చంద్రబాబు ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకుంటారని టీడీపీ పై స్థాయి నేతలు అంటుండగా కింది స్థాయి నాయకులను మాత్రం చంద్రబాబు అరెస్టు వార్త ఆందోళనను కలిగిస్తోంది.
See Also:ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!