ప్రముఖ నటి శ్రీదేవి మృతి పట్ల వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరాని లోటు అని పేర్కొన్నారు.శ్రీదేవి మరణం పట్ల జగన్ ఒక ప్రకటన ను విడుదల చేశాడు.
see also :మరణానికి కొన్ని గంటల ముందు శ్రీదేవి ఎలావుందంటే ..? వీడియో
‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నటన, ఛరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆమె. దక్షిణ భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ ఆమె నటించి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మరచిపోలేని పాత్రలేన్నో ఆమె పోషించి మెప్పించారు. ఇంగ్లీష్ వింగ్లీష్‌లో గృహిణి పాత్ర శ్రీదేవి ఎంతటి అసమాన నటి అన్న విషయం తెలియజేసింది..ఆ లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని వైఎస్ జగన్ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
see also : శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
see also :శ్రీదేవి మరణం పట్ల రామ్ గోపాల్ వర్మ ఏమని ట్వీట్ చేశారంటే